చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి : మాజీ ఎంపి మార్గాని భరత్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను, కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని వైసిపి అధికార ప్రతినిధి, మాజీ ఎంపి మార్గాని భరత్‌ కోరారు. చంద్రబాబు లడ్డుపై చెప్పింది అబద్దాలు అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బట్టబయలు చేశారని తెలిపారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరస్వామి ప్రతిష్టపై చంద్రబాబునాయుడు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టేందుకే రాష్ట్రవ్యాప్తంగా వైసిపి శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేశారని తెలిపారు.

➡️