నలుగురు బాలికలు-ఓ మహిళ మిస్సింగ్‌

నెల్లూరు జిల్లా : వెంకటగిరి పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో నలుగురు బాలికలు, ఓ మహిళ మిస్సింగ్‌ కావడం కలకలం రేపింది. నెల్లూరు జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ, ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ముగ్గురు బాలికలు, బప్పాపురం సాలికాలనీకి చెందిన రాయవరం లిఖిత అనే బాలిక (16), డక్కిలి మండలం మాటుమాడుగు గ్రామానికి చెందిన స్వర్ణ దేవి అనే మహిళ మిస్సింగ్‌ అయ్యారు. వారు ఇంటికి రాకపోయేసరికి ఆందోళన చెందిన వారి కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఎస్సీ హాస్టల్‌ నుంచి మిస్సింగ్‌ ఆయన ముగ్గురు బాలికలను పోలీసులు తిరుపతిలో గుర్తించినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️