చిత్తూరులో ఘోర ప్రమాదం..  బాలుడుసహా నలుగురు మృతి

ప్రజాశక్తి- విజయపురం, నగరి: చిత్తూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలుడు సహా నలుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు..తమిళనాడుకు చెందిన భారతి ట్రావెల్‌ బస్సు తిరువళ్లూరు నుంచి తిరుపతికి బయలుదేరింది. చిత్తూరు జిల్లా నగరి సాయిబాబా గుడి సమీపంలో హైవే నుంచి నగరి టౌన్‌లోకి వస్తుండగా లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు ఢకొీన్నది. ఈ ప్రమాదంలో బాలుడు సహా నలుగురు మరణించారు. గాయపడిన 15 మందిని నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రయాణీకులందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు.

➡️