ఉగాది నుంచి పి-4

  • ఉగాది నుంచి పి-4 ప్రారంభ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐలు
  • జిల్లాల వారీగా విజన్‌ – 2047 సమీక్షలో చంద్రబాబు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పి-4 (పబ్లిక్‌-ప్రయివేటు-పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌) విధానాన్ని ఉగాది నుండి అమలులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పి4, విజన్‌- 2047లపై ఆయన మంగళవారం ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి-4 అమలుకు అవసరమైన సన్నాహాలు చేస్తూనే జిల్లాల వారీగా ‘విజన్‌ -2047’ను ఆచరణలోకి తీసుకురావాల్సిఉంటుందని అన్నారు. కీలకమైన ఈ రెండు అంశాలపై క్షేత్రస్థాయి వరకు అధికారయంత్రాంగం దృష్టి సారిం చాలని చెప్పారు.
పి-4 గురించి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే ఆ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.పూర్తిస్థాయిలో విది óవిధానాల రూపకల్పన కోసం ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా రూపొం దిస్తున్నట్లు చెప్పారు. ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే పి-4 విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. పేదలకు సాయం చేసేరదుకు ఉన్నత స్థాయిలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, ఎన్నారైలు మురదుకు వస్తున్నారని వివరిరచారు. ఇలా ముందుకు వచ్చే వారందర్ని ఉగాది రోజు జరిగే పి-4 ప్రారంభ కార్యక్రమానికి తాను స్వయంగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అటువంటి వారందరినీ ఒకే గొడుగు కిరదకు తీసుకురావడం ద్వారా పి-4 అమలు చేస్తామన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది., పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం లక్ష్యంగా మురదుకు సాగాలని చెప్పారు. పేదలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, ప్రణాళిక శాఖ సంచాలకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️