వెబ్‌సైట్లలో ఫోటోలు తొలగించాలి : జిఎడి ఆదేశాలు

Jun 9,2024 08:56 #ap governer, #photos, #remove

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వెబ్‌సైట్లలో ఇప్పటి వరకూ ఉన్న ఫోటోలనూ వెంటనే తొలగించాలని సాధారణ పరిపాలనశాఖ ఆదేశాలు జారీచేసింది. వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 108 శాఖలకు సంబంధించిన వివిధ డిపార్టుమెంట్లలో ఇప్పటికీ పాత క్యాబినెట్‌కు సంబంధించిన ఫోటోలే ఉన్నాయి. ఫోటో గ్యాలరీల్లోనూ పాత ప్రభుత్వంలోని సిఎంగానీ, మంత్రులుగానీ ఉన్నట్లయితే వాటిని కూడా వెంటనే తొలగించాలనీ అందులో పేర్కొన్నారు.

➡️