గాంధేయవాది పసల కృష్ణభారతి కన్నుమూత

తెలంగాణ : గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి- అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె కృష్ణభారతి. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ, గాంధీజీ ప్రవచించిన విలువలతోనే ఆమె జీవించారు. పలు విద్యాసంస్థలకు నిధులు అందించారు. దళితుల్లో విద్యావ్యాప్తికి కృషిచేశారు. గోశాలలకు విరాళాలు సమకూర్చారు. అవివాహితగా ఉన్న కృష్ణభారతికి నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. 2022 జులైలో భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కృష్ణభారతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడి సత్కరించారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

➡️