వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్‌ విడుదల..

ప్రజాశక్తి-అమరావతి : వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనియర్సిటీగా మార్చింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లును చట్టంగా మార్చింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. దీనిపై జూన్ 24న ఏపీ అసెంబ్లీలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశ పెట్టిన తీర్మాణం ప్రవేశపెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దీంతో ఇవ్వాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

➡️