కోనసీమ జిల్లా కేశనపల్లిలో జిజిఎస్‌ గ్యాస్‌ లీక్‌

Mar 13,2025 07:44 #ambedkar konaseema, #gas, #gas leak

ప్రజాశక్తి-కోనసీమ : అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో గ్యాస్‌ లీకేజ్‌ కలకలం రేపింది. మలికిపురం మండలం కేశనపల్లిలోని గ్రూప్‌ గ్యాస్‌ గ్యాదరింగ్‌ స్టేషన్‌లో గ్యాస్‌ లీకైంది. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌ లీకేజీతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గ్యాస్‌ వ్యాపించటంతో స్థానికులు, చుట్టుప్రక్కల ప్రజలు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి, గ్యాస్‌ లీకేజీపై దర్యాప్తు చేపట్టారు.

➡️