హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ బిఆర్ఎస్ గట్టి షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, భారాస స్టేషన్ఫన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
