ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (విజయవాడ) : జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్‌లో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులు బహుమతులు సాధించారు. గత నెల 28 తేదీన విజయవాడ ఆంధ్ర లయోల కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెస్ట్‌లో బహుమతులు సాధించిన విద్యార్థులను గుడ్లవల్లేరు ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రాజశేఖర్ మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ క్విజ్‌లో ఇసిఇ విభాగం విద్యార్థులు కె రాజు, ఐ నరేంద్రరెడ్డిలకు ద్వితీయ బహుమతి, సిహెచ్ జగదీశ్‌కుమార్, ఎ సాయిశర్వన్‌లకు తృతీయ బహుమతి, మెకానికల్ విద్యార్థులు డి మణికంఠ, జి శ్యాంకిషోర్, ఐ ఎన్ గోపాల్, సిహెచ్ జగదీశ్వర్‌లకు ద్వితీయ బహుమతి, ఎఐఎంఎల్ విద్యార్థులు కె నిర్మల, కె గణేష్ నాయక్ ద్వితీయ బహుమతులు సాధించారని తెలిపారు. పోస్టర్ ప్రెసెంటేషన్‌లో ఆర్ విష్ణు వర్ధన్, ఎం శ్యాం ద్వితీయ స్థానాలు, ఎస్‌కె శ్రీ, బి పవన్ తృతీయ స్థానాలు లభించాయన్నారు. స్టూడెంట్ అటెండన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం అనే అంశంపై కంప్యూటర్ విద్యార్థులు కెవి రామాంజనేయలు, ఎంఎల్ ప్రశాంత్ ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రత్యేక శిక్షణ అందించిన ఆయా విభాగాధిపతులను యాజమాన్య సభ్యులు చైర్మన్ డాక్టర్ నాగేశ్వరావు వల్లూరుపల్లి, సెక్రటరీ, కరస్పాండెంట్ సత్యనారాయణరావు వల్లూరుపల్లి, కో సెక్రటరీ, కరస్పాండెంట్ రామకృష్ణ వల్లూరుపల్లి, ఎక్సుక్యూటివ్ మెంటర్ రామాంజనేయులు, అకడమిక్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అభినందించారు.