జిఓ 117 రద్దు చేస్తాం

పాఠశాల విద్యలో సంస్కరణలు అనివార్యం
చాగంటి సూచనలతో పాఠ్యాంశాల రూపకల్పన
ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి లోకేష్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయడం అనివార్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోందని, డ్రాపవుట్స్‌ కూడా పెరుగుతున్న నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. ఇప్పుడు అమలు చేయలేకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడే ప్రశాుర్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. సంస్కరణల అమల్లో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం సమావేశమయ్యారు. జిఓ 117 రద్దు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోనుతులు తదితర అంశాలపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. సంస్కరణల అమల్లో భాగంగా ప్రతి పాఠశాలకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తున్నామని లోకేష్‌ అనాురు. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 30 శాతం ఉన్నాయని, 300 పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని కోరారు. జిఓ 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు. చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి పాఠశాలలకు రావడం కష్టమని తెలిపారు. అపార్‌ ఐడి నమోదులో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలతో పోటీపడాలని చెప్పారు. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం, ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకుబాలల్లో నైతిక విలువలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గిస్తామన్నారు. మౌలిక సదుపాయాలు హార్డ్‌వేర్‌ అయితే టీచర్లు సాఫ్ట్‌వేర్‌ వంటి వారని అన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్ర మోడల్‌ ఎడ్యుకేషన్‌ తమ లక్ష్యమని, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమని చెప్పారు.
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ.. ఫలితాల సాధన, హాజరుశాతం పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడదని, టీచర్‌ కూడా తగ్గకూడదని మంత్రి తమకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. బదిలీలు, పదోనుతులు ఎలా ఉండాలనే అంశంపై సంఘాల అభిప్రాయం తీసుకునాుమని చెప్పారు. వారి సూచనల మేరకుప్రత్యేక యాప్‌ రూపొందించామని, ఏప్రిల్‌, మే నెలల్లో పూర్తి పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి తరగతి గదికి ఒక టీచర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాలుగైదు గ్రామాలకు కలిపి మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తునాుమని వెల్లడించారు. స్కావెంజర్స్‌ జీతాల విషయంలో ఉపాధ్యాయ సంఘాల సూచనను పరిశీలిస్తామని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు అనాురు. కొత్తగా ఏర్పాటు చేసే మోడల్‌ స్కూళ్లకు రవాణా సౌకర్యం కల్పించాలనిఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం అమలు చేయాలని, ఆటలను ప్రోత్సహించేందుకు రూరల్‌ పాఠశాలల్లో పిఇటిలను నియమించాలనికోరారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, పి అశోక్‌ బాబు, వేపాడ చిరంజీవిరావు, భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, యుటిఎఫ్‌, ఎస్‌టియు, ఎపిటిఎఫ్‌-1938, ఆప్టా, పిఆర్‌టియు, ఎపిటిఎఫ్‌, ఎపియుఎస్‌, వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎల్‌ సాయిశ్రీనివాస్‌, ఎం రఘునాథరెడ్డి, జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి, ఎజిఎస్‌ గణపతిరావు, ఎ ప్రకాశరావు, ఎం కృష్ణయ్య, ఎఎం గిరిప్రసాద్‌, సిహెచ్‌ మంజుల, కె భానుమూర్తి, ఎస్‌ బాలాజీ, జివి సత్యనారాయణ, పి అశోక్‌ కుమార్‌, జి సుధీర్‌ తదితరులు పాల్గనాురు.

➡️