పలు సవరణలతో జిఓ 139 విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేవాదాయశాఖకు చెందిన వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, లీజులు, లైసెన్స్‌లు నియామకాలు-2003కు సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జిఓ ఎంఎస్‌ నెంబరు 139ని విడుదల చేసింది. 20 ఏళ్లు ఏ సంస్ధ, సేవా ట్రస్టులు ఆయా ఆలయాలకు సేవలందిస్తున్నట్లు గుర్తిస్తే ఆయా సంస్ధలకు భూములు వేలం పాట ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా లీజుకు ఇచ్చే అవకాశం ఈ సవరణ ద్వారా కలుగుతుంది. ఇప్పటి వరకు మూడేళ్ల పాటు దేవాదాయశాఖ తమ ఆస్తులను లీజుకు ఇచ్చే అవకాశం ఉండేది. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన సవరణ ద్వారా 20 ఏళ్ల సేవ పేరుతో ఆయా ఆస్తులను వేలం పాట ద్వారా కాకుండా, నేరుగా లీజుకు ఇవ్వనుంది.

➡️