ఇంటర్నెట్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీ వరద నీరు చేరింది. ప్రస్తుతం వరద ఉదృతి తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 47.3అడుగులుగా ఉన్నదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ & ఔట్ ఫ్లో 14.56లక్షల క్యూసెక్కులుగా నమోదు అయింది. 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. సహాయక చర్యల్లో 11బృందాలు పాల్గొన్నాయి. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
