రాజకీయాలకు కేశినేని నాని గుడ్‌బై

Jun 11,2024 09:54 #mp kesineni nani, #Retirement

ప్రజాశక్తి- విజయవాడ : విజయవాడ మాజీ ఎంపి కేశినేని శ్రీనివాస్‌ (నాని) రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైసిపిలో చేరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసిపి విజయవాడ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి, తన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ‘ఎక్స్‌’ వేదికగా నాని ప్రకటించారు. అన్ని విధాలుగా ఆలోచించిన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

➡️