పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట : మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఎపి ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని రూపొందించిందని విద్యుత్‌ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ఎపి సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ రూపొందించిన కొత్త సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌తో కలిసి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో ఎమ్‌డి కెవి చక్రధర్‌ బాబు, ట్రాన్స్‌కో జెఎమ్‌డి కీర్తి చెకూరి, సిపిడిసిఎల్‌ సిఎమ్‌డి పఠాన్‌శెట్టి రవిసుభాష్‌, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డి కమలాకర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగుల సంక్షేమ డైరీ ఆవిష్కరణ

ఎపిఎస్‌ఇబి ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన డైరీని మంత్రి రవికుమార్‌ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఆవిష్కరించారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై త్వరలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జెఎసి)తో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో గ్రిడ్‌ డైరెక్టర్‌ ఎకెవి భాస్కర్‌, జెన్‌కో డైరెక్టర్‌ పి నవీన్‌ గౌతమ్‌, విటిపిఎస్‌ సిఇ టి నాగరాజు, అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం శివకుమార్‌, ఎవి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️