అమరావతి : వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించిందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ, 34 వేల మంది కుటుంబ సభ్యులకూ లబ్ధి చేకూరనుందని, జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
