ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు నిర్ధేశించిన చట్టాన్ని అమలు చేయడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ చట్టం అమలు, ఉద్యోగ అవకాశాల్లో, పదోన్నతుల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేయాలంటూ ఇండియన్ డిసేబుల్డ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గుంటుపల్లి సతీష్ గోవింద్ పిల్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించి రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. చట్టాల అమలు, 4 శాతం రిజర్వేషన్లపై కౌంటర్ వేయాలని ఆదేశించింది. తొలుత న్యాయవాది పిచ్చుక శ్రీనివాసులు వాదిస్తూ, నాలుగు శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.