విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రభుత్వాలు

  • ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ప్రజాశక్తి – విజయనగరం కోట : ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కాపాడుకునేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. అదానీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ఎఐఎస్‌ఎఫ్‌ 49వ రాష్ట్ర మహాసభల బుధవారం ప్రారంభమైంది.
రామకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పగడ్బందీగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య లౌకిక పార్టీలు కోరుతుంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి మతోన్మాద శక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. అదానీకి నరేంద్ర మోడీ, అమిత్‌ షా వత్తాసు పలుకుతూ ప్రభుత్వ రంగ ఆస్తులను దోచిపెడుతున్నారన్నారు. గురజాడ కళాక్షేత్రంలో ఆడిటోరియంలో ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్‌ రంగరాజన్‌, ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, కె.శివారెడ్డి మాట్లాడారు. మత భావాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను పాఠ్యాంశాలలో కేంద్రప్రభుత్వం చేర్చుతోందని మండిపడ్డారు. ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన గేయాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు.

➡️