మంత్రి టీ.జీ భరత్ ని మర్యాద పూర్వకంగా కలిసిన పాలకవీటి విజయ కుమార్

Nov 27,2024 17:51 #T G Bharath

ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : రాష్ట్ర పరిశ్రమలు – ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ భరత్ ని ఎపి నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాలకవీటి విజయ కుమార్ మౌర్య ఇన్ లోని ఆయన వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువాతో సన్మానించి
పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా  నియమించడం చాలా సంతోషంగా ఉందని పాలక వీటి విజయకుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని అందుకు తాను నిదర్శనం విజయ కుమార్ అన్నారు. పాలకవీటి విజయకుమార్ తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచలంచెలుగా ఎదిగి రాష్ట్రస్థాయిలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎదగటం చాలా సంతోషించదగ్గ విషయమని మంత్రి భరత్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార వైసిపి పార్టీ అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను వివిధ సామాజిక వర్గ ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యాన్ని కలిగించి పార్టీ గెలుపు కొరకు విజయకుమార్ బాగా కృషి చేశారు. గత వైసిపి ప్రభుత్వం పాలనలో బీసీలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అణచివేతకు గురయ్యారు. బీసీ సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే బీసీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తారని విజయకుమార్ కి పదవి రావడంతో మరోసారి నిరూపితమైనదని తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రివర్యులు టీజీ భరత్ తెలిపారు.

➡️