ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

  • చంద్రబాబుపై దాడి కేసులో వైసీపీ నేతలు

ప్రజాశక్తి, అమరావతి : విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ప్రధాన భద్రతాధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కృష్ణా జిల్లా, నందిగామ పోలీసులు నమోదు కేసులో తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ వైసీపీ నేతలు ఎం.అరుణ్‌ కుమార్‌, మొండితోక జగన్‌మోహన్‌రెడ్డి, చిరుమామిళ్ల శ్రీనివాస్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. 2022 నవంబర్‌ 5న నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు ఇవ్వాలని కోరారు. అంతుకు ముందు రోజు చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించేందుకు వెళ్లారు. రైతు బజార్‌ వద్ద రాళ్ల దాడి జరిగింది. దీనిపై చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి మధుసూధన్‌రావు గాయపడ్డారు. ఆ కేసులో పోలీసులు ఇటీవల రిమాండ్‌ రిపోర్టును కింది కోర్టులో సమర్పించారు. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు అయినప్పటికీ తాము పోలీసుల దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు రిట్లలో పేర్కొన్నారు.

➡️