అమరావతి : గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్ చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ … అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందన్నారు. ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని తెలిపారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని, గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్ చేస్తుందని అన్నారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.