త్వరలో తల్లికి వందనం మార్గదర్శకాలు

Jul 13,2024 00:28 #Ammaku Vandanam, #notification

పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు, విధి విధానాలను ప్రభుత్వం రూపొందించిన తరువాత తెలియజేస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు. అప్పటి వరకు ఎటువంటి అవాస్తవ కథనాలను నమ్మొద్దని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆధార్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 9న జిఓ 29ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఇది ఆధార్‌ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే అని తెలిపారు. ఈ జిఓ పేరుతో తల్లికి వందనం పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అటువంటి వాటిని నమ్మొద్దని పేర్కొన్నారు.

➡️