ఎమ్మెల్సీగా గ్రీష్మ ప్రమాణస్వీకారం

May 9,2025 21:34 #ap mlc

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనమండలి సభ్యులుగా కావలి గ్రీష్మ ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తన కార్యాలయంలో గ్రీష్మతో శుక్రవారం ప్రమాణం చేయించారు. అనంతరం శాసనమండలి నియమ, నిబంధనలకు సంబంధించిన కిట్‌ను ఆమెకు ఛైర్మన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ సూర్యదేవర, శాసనసభ మాజీ స్పీకరు ప్రతిభా భారతి తదితరులు పాల్గన్నారు.

➡️