ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం.. ఆందోళనలో గ్రూప్‌-1 అభ్యర్థులు

Jun 9,2024 17:05 #Concern, #Group-1 candidates

జగిత్యాల :జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్‌ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష ముగియడానికి అరగంట సమయం ఉన్నప్పటికీ ఐదు నిమిషాలే ఉందని అభ్యర్థులను ఇన్విజిలేటర్‌ తొందరపెట్టాడు. దీంతో సమయం మించిపోతుందనే తొందరలో చాలామంది అభ్యర్థులు ఏదో ఒక ఆన్సర్స్‌ను బబుల్‌ చేశారు.తీరా చూస్తే ఇంకా సమయం ఉందని తెలియడంతో గ్రూప్‌-1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇన్విజిలేటర్‌ తొందర పెట్టినందున తమకు మార్కులు తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం చేయాలంటూ కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు.

➡️