ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) గ్రూప్-1 హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఆదివారం నుంచి పొందుపరచనుంది. ఈ మేరకు కమిషనర్ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. psc.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ముందుగానే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని కమిషన్ మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు.
