గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభం..

Jun 9,2024 10:57 #Group-1 prelims exam, #started

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులను ముందుగానే చేరుకున్నారు. ఒక్కో అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే సిబ్బంది ఎగ్జామ్‌ సెంటర్‌లోకి అనుమతించారు. అయితే సిద్దిపేట డిగ్రీ కాలేజీ సెంటర్‌ వద్దకు నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన పది మంది అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. దీంతో వారు నిరాశగా అక్కడి నుంచి వెనుతిరిగారు.
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టులను గ్రూప్‌-1 ద్వారా టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్నది. ఈ పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారికోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది.

➡️