తెలంగాణ : తెలంగాణలో గ్రూప్ -3 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ఈరోజు మధ్యాహ్నం ప్రకటించింది. అలాగే, గ్రూప్-3 పరీక్ష తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో https://www.tspsc.gov.in అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 1,365 గ్రూప్-3 ఉద్యోగాలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో మూడు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం … మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్- 1, గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షల తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు.
