జెన్‌కో డైరెక్టర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెన్‌కోలో డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు జివో 36ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ బుధవారం విడుదల చేశారు. ఆర్థిక-వాణిజ్య, థర్మల్‌, హైడల్‌, కోల్‌-లాజిస్టిక్‌, హెచ్‌ఆర్‌-ఐఆర్‌ డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన అర్హతలు, అనుభవం వివరాలను పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, ప్రభుత్వ రంగ సంస్థలో గానీ 25 ఏళ్లు పాటు పనిచేసినవారు ఈ పోస్టులకు అర్హులుగా తెలిపారు.

➡️