ప్రజాశక్తి-మంగళగిరి : ఈనెల 4 తేదీ నుండి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరుతున్న కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో పాల్గొని బంగారు పతకం సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. షేక్. సాదియా ఆల్మస్ ఈ పోటీల్లోస్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్‌లిఫ్ట్ 180 కిలోలు – బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు – బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించాలని పేర్కొన్నారు. ఇదే క్రమంలో కామన్వెల్త్ జూనియర్ 57 కేజీల విభాగంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి పవర్ లిఫ్టర్ గా షేక్ సాదియా అల్మాస్ నిలిచారు. ఈ విజయం పట్ల మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ& విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరావు, ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు మద్ది ప్రభాకరరావు, కోశాధికారి సిహెచ్ శేషుబాబు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ ఎన్ వంశీకృష్ణ, కోశాధికారి జి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు షేక్ సాదియా అల్మాస్ ను మరియు ఆమెకు శిక్షణ ఇచ్చిన ఆమె కోచ్ షేక్ సంధాని ని అభినందించారు అని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని తెలియజేశారు.
