కోకో రైతుల చలో గుంటూరు వాయిదా

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : కోకో రైతులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 15న నిర్వహించ తలపెట్టిన చలో గుంటూరు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. సోమవారం ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌.గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడారు. కోకో రైతులకు న్యాయం చేస్తామని ఈ నెల 12న ఆగిరిపల్లికి సిఎం వచ్చిన సందర్భంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో ‘చలో గుంటూరు’ను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️