- నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషనర్
ప్రజాశక్తి -ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ జివిఎంసి మేయర్ ఎన్నికను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని విశాఖ జిల్లా కలెక్టర్, జివిఎంసి ఇన్‌ఛార్జి కమిషనర్ ఎమ్‌ఎన్.హరేంధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు నోటిఫికేషన్ ప్రకారం జివిఎంసికి ఎన్నికైన సభ్యులు, ఎక్స్-ఆఫీషియో సభ్యులకు మేయర్ ఎన్నిక నిమిత్తం ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలని నోటీసు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.