- మరో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో కాకినాడ 3, అంబేద్కర్ కోనసీమ 7, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. ఆదివారం 54 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.