బాలకృష్ణకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Jun 10,2024 14:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, సినీ నటులు నందమూరి బాలకృష్ణకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా రంగంలో అన్‌స్టాపబుల్‌ అనిపించుకున్న బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో తిరుగులేని ప్రజాదరణతో నిండు నూరేళ్లు ఆనంద, ఆయురాగ్యోలతో వర్ధిల్లాలని ఆకాక్షించారు.

టిడిపి కార్యాలయంలో వేడుకలు
బాలకృష్ణ జన్మదిన వేడుకలు టిడిపి కార్యాలయంలో జరిగాయి. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, ఎపి నాటక అకాడమీ ఛైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ అధ్యక్షులు నన్నపనేని రాజకుమారి, పార్టీ నేతలు రఫీ తదితరులు పాల్గొన్నారు.

➡️