తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు : ఏపీ సీఎం చంద్రబాబు

విజయవాడ : తెలుగు ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిలో సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండగ సమయంలో ఊరెళ్లి అందరితో సంతోషంగా గడపాలని.. అందుకే తాను ప్రతి సంక్రాంతికి ఊరికి వెళుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఊరిలో పేదవారు ఆనందంగా ఉండేలా చూడాలని చంద్రబాబు కోరారు. ఈ విధానం ప్రోత్సహించడానికే పీ4 కాన్సెప్ట్‌ పేపర్‌ను ఆదివారం విడుదల చేస్తున్నామని తెలిపారు. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చ జరిగాకే అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. పీ4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలన్నారు.

➡️