తాగినమత్తులో నేలబావిలో దూకాడు.. నేడు విగతజీవిగా తేలాడు..!

May 15,2024 10:19 #jump, #person died, #well

విప్పర్లరోడ్డు (గుంటూరు) : ఎన్నికల రోజున భార్యాభర్తలు గొడవపడ్డారు. ఎవరికీ చెప్పకుండా తాగిన మత్తులో భర్త నేలబావిలో దూకాడు. మూడు రోజుల తరువాత బుధవారం నేలబావిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా విప్పర్ల రోడ్డు పక్కన జరిగింది. ఎలక్షన్‌ రోజున భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తరువాత భర్త (30) ఎవ్వరికీ చెప్పకుండా తాగిన మత్తులో పల్లె పక్కనే ఉన్న నేలబావిలో దూకాడు. అతడి ఆచూకీ కోసం బంధువులు గత 3 రోజులుగా వెతుకుతూనే ఉన్నారు. ఈరోజు ఉదయం నేలబావిలో అతడి మృతదేహం పైకి తేలింది. బహిర్భూమికి వెళ్లినవారు మృతదేహాన్ని గుర్తించడంతో గ్రామప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️