రేపు సుప్రీంకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌పై విచారణ

Jan 14,2025 15:56 #e-car racing case, #KTR, #supreem court

హైదరాబాద్‌ : ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , మాజీ మంత్రి కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో, కేటీఆర్‌ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బేలా ఎం త్రివేది , జస్టిస్‌ ప్రసన్న వర్లె ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ జరపనుంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసి, హైకోర్టు తీర్పుపై కేటీఆర్‌ పిటిషన్‌ వేస్తే తమ వాదనలూ వినాలని సుప్రీం కోర్టును కోరింది. కేటీఆర్‌ పిటిషన్‌కు సంబంధించిన విచారణ , ప్రభుత్వ వాదనలు రేపు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి.

➡️