మేడ్చల్ : మేడ్చల్ సీసీఐ పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గోదాం పరిసర ప్రాంతమంతా పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాం కుప్పకూలింది. మంటలు చెలరేగిన వెంటనే గమనించిన కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.