Hyd – హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

Apr 14,2025 12:39 #in hotel, #Major fire

తెలంగాణ : హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌ లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటలంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో హోటల్‌ లో ఉన్న టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. హోటల్‌ లోని మొదటి అంతస్తులో విద్యుత్‌ వైర్లు కాలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్‌ ఆఫీసర్‌ వెంకన్న తెలిపారు. ప్రస్తుతం పార్క్‌ హయత్‌ హోటల్‌ లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలిపారు.

➡️