శ్రీశైలానికి కొనసాగుతున్న భారీ వరద

Aug 28,2024 09:30 #continues, #Heavy flood, #srisailam

శ్రీశైలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కఅష్ణా నదికి మరోసారి వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా క్రమం క్రమంగా ఈ వరదలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఆది, సోమ, మంగళవారాల్లో భారీ వర్షం కారణంగా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. కాగా ఇప్పటికే నిండుకుండాలా ఉన్న శ్రీశైలానికి ఎగువ నుంచి 2,13,624 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులకు చేరుకుంది. దీంతో మరికొద్ది సేపట్లో మరోసారి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుండగా.. 68,876 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. దీంతో నాగార్జున సాగర్‌ రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

➡️