Rains: ఏపీలో భారీ వర్ష సూచన

Nov 28,2024 10:21 #Rains in AP
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు (28, 29, 30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
➡️