నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

Apr 25,2024 07:50 #vadagalupulu
  •  విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళం 13, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 3, విశాఖలోని పద్మనాభం మండలాలు ఉన్నాయి. వడగాడ్పులు వీచే మండలాల్లో శ్రీకాకుళం 15, విజయనగరం 4, పార్వతీపురం మన్యం 3, అల్లూరి సీతారామరాజు 12, విశాఖపట్నం 3, అనకాపల్లి 15, కాకినాడ 17, అంబేద్కర్‌ కోనసీమ 9, తూర్పుగోదావరి 19, పశ్చిమ గోదావరి 4, ఏలూరు 14, కృష్ణా 9, ఎన్‌టిఆర్‌ 5, గుంటూరు 14, పల్నాడు 5, బాపట్ల 1, ప్రకాశం 1, తిరుపతి 3, నెల్లూరు జిల్లా మనుబోలు మండలాలు ఉన్నాయి. ఈ నెల 24న విజయనగరం జిల్లా తుమ్మికాపల్లిలో 45 డిగ్రీలు, వైఎస్‌ఆర్‌ జిల్లా బలపనూరులో 44.9, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3, నంద్యాల జిల్లా మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1, ఎన్‌టిఆర్‌ జిల్లా కంభంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 44 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 105 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు పేర్కొన్నారు.

➡️