తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి

May 14,2024 18:18 #jc prabhakar reddy, #police, #tadipatri
  •  సిఐకు గాయలు

ప్రజాశక్తి-తాడిపత్రి : తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు చేసుకోగా.. సిఐ మురళీకష్ణ తలకి గాయాలయ్యాయి. నిన్న టీడీపీ నేత సూర్య ముని ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పీఎస్‌ వద్ద జేసీ ప్రభాకర్‌ ధర్నాకు దిగారు. తర్వాత ఆయన పెద్దారెడ్డి ఇంటివైపు కార్యకర్తలతో వెళ్తుండగా వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో.. ఉద్రికత చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు చేసుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

➡️