ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూముల రీ సర్వేకు సంబంధించి భూ యజమానులు, సర్వే సిబ్బంది, రెవెన్యూ సిబ్బందికి ఎటువంటి సందేహాలున్నా వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర స్థాయి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సందేహాలు నివృత్తి కోసం కార్యాలయం పనిరోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8143679222కు ఫోన్ చేయొచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని భూ యజమానులు, రెవెన్యూ సిబ్బంది వినియోగించుకోవాలని ఆ శాఖ విజ్ఞప్తి చేసింది.
