ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కెటిఆర్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తనపై ఎసిబి నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఫార్ములా ఇ-రేసు వ్యవహారంలో ఎసిబి నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కెటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం తీర్పు ప్రకటించింది. కెటిఆర్‌ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. హైకోర్టు తీర్పుపై కెటిఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది.