ఈసీ చర్యలను సమర్దించిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. పెన్షన్ల పంపిణీకి ప్రత్నమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సీఎస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది.
వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఈసీ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈసీ చర్యలను సమర్థిస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చింది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ విధుల నుండి ఈసీ తొలగించిన విషయం తెలిసిందే.

➡️