తిరుపతిలో విద్యాసంస్థలకు సెలవు

Nov 30,2024 12:31 #Rains in AP, #Tirumala

 జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా నేడు (శనివారం) తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం నుండి సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగాల్ తుఫాన్ గా మారడం వలన జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు, అన్ని జూనియర్ కళాశాలలకు నేడు (శనివారం) మధ్యాహ్నం సెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.

 తిరుమలలో ఆగని వర్షం

శుక్రవారం రాత్రి నుండి ఆగకుండా వర్షం కురుస్తున్నది. బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తిరుమలంతట దట్టంగా మంచు కమ్మేసింది. చలి తీవ్రత పెరిగింది. దీంతో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచన చేసింది. ఘాట్ రోడ్డులో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

➡️