విశాఖ డెయిరీ అవినీతిపై విచారణకు హౌస్‌ కమిటీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ డెయిరీలో అవినీతి, అక్రమాలపై విచారణ చేసేందుకు శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రత్యేక హౌస్‌ కమిటీని శుక్రవారం నియమించారు. ఇదే అంశంపై ఈ నెల 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగుపడినట్లు స్పీకరు తెలిపారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్‌కెకె రంగారావు, దాట్ల సుబ్బరాజును నియమించారు. కమిటీ సమగ్ర విచారణ చేసి రెండు నెలల్లో నివేదికను సమర్పించాలని స్పీకర్‌ ఆదేశించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇది ఒక కీలక అడుగుగా ఆయన అభిప్రాయపడ్డారు.

➡️