పెళ్లిలో ఉంటే దాడిలో ఎలా ఉంటారు?

  • టిడిపి ఆఫీస్‌పై దాడి కేసులో హైకోర్టు
  • సిఐడి డిఎస్‌పి హాజరుకావాలని ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి ఆఫీసుపై దాడి జరిగినప్పుడు తాను నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నానని వైసిపి నేత, గుంటూరు కార్పొరేటర్‌ పడాల సుబ్బారెడ్డి పలు ఆధారాలను హైకోర్టుకు నివేదించారు దాడి ఘటన సమయంలో అక్కడ ఉన్నారంటూ సిఐడి కౌంటర్‌ దాఖలు చేసింది. సుబ్బారెడ్డి టిడిపి ఆఫీసు వద్ద ఉన్నట్లు సిసి కెమెరాల్లో రికార్డ్‌ అయిందని కూడా చెప్పింది. సుబ్బారెడ్డి నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే, దాడిలో ఎలా ఉంటారని హైకోర్టు పోలీసులను నిలదీసింది.
ఈ నెల 12న మధ్యాహ్నం 2.15 గంటలకు స్వయంగా తమ ఎదుట హాజరుకావాలని దర్యాప్తు అధికారి డిఎస్‌పిని ఆదేశిస్తూ జస్టిస్‌ కె శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, అక్టోబర్‌ 19న మంగళగిరి వద్ద టిడిపి మెయిన్‌ ఆఫీస్‌పై దాడి జరిగింది.

➡️