-రు.10కోట్లు ఇచ్చిన కాటూరి సుబ్బారావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వరద బాధితుల సహాయార్ధం భారీ విరాళాలు అందుతున్నాయి. పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖులు సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు అందిస్తున్నారు. కాటూరి సుబ్బారావు రూ.10కోట్లు, జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ.5కోట్లు, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ సిఎండి కెవిరావు, ఏఎమ్ గ్రీన్-గ్రీన్‌కో సంస్థ రూ.5కోట్లకు చెందిన చెక్కులను ముఖ్యమంత్రికి శుక్రవారం అందించారు. శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ.2కోట్లు, విట్ ఛాన్సలర్ విశ్వనాథమ్ రూ.1,57,50,000లు, ఎపి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్ రూ.1.50కోట్లు, ఆర్‌విఆర్ ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటేడ్, మాజీ ఎంపి గోకరాజు గంగరాజు, సుజలాన్ అండ్ యాక్సిస్ ఎనర్జీ, అనకాపల్లి ఎంపి సిఎం రమేష్ కుమారులు రాజేష్, రిత్విక్ కలిపి రూ.కోటి చొప్పున అందించారు. మోహిత్ మినరల్స్ సంస్థ రూ.51లక్షలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు రూ.50లక్షలు, విజయవాడ క్లబ్ తరపున క్లబ్ రూ.50లక్షలు అందించారు. శ్రీకాకుళం జిల్లా పొదుపు సంఘాల మహిళలు, కళ్యాణ్ ఆక్వారీస్ అండ్ మెరైన్ ఎక్స్‌పోర్ట్ ఇండియా లిమిటేడ్ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు, కోటపాటి జనార్థన్ రావు రూ.10లక్షలు చొప్పున అందించారు. పిఐవిఓఎక్స్ ల్యాబ్స్ రూ.7,0,3999లు, టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోటం సంధ్య, సిశ్వాన్‌ఇన్ ఫ్రా, మధూర్ భార్గవ్ నాయుడు, ఆల్ఫా ఎడ్యుకేషన్ సొసైటీ, కమల కుమారి, చెన్నుపాటి గాంధీ, ఆర్ లక్ష్మీకుమారిలు ఒకొక్కరు రూ.5లక్షలు చొప్పున చెక్కును అందించారు. శంకరరావు రూ.3లక్షలు, సూరెడ్డి నరేంద్రబాబు, వై జానకి,ముక్కమల పార్ధసారధి రూ.2లక్షలు చొప్పున అందించారు. స్వాతంత్ర సమరయోధులు, సర్వోదయ ట్రస్ట్ తరపున మోహన్ కృష్ణ రూ.1.50లక్షలు, శ్రీనివాసం రూ.1,22000లు, యాదాటి రమేష్‌బాబు, దుర్గారాణిలు, విలువల్లీ ఛాలెంజడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, టిజివిఎస్ ఎంప్లాయీస్ కల్చర్ అసోసియేషన్, వై చలపతిరావు, సిహెచ్ దీపిక, బప్ప అనురాధ రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. ఏ శోభారాణి రూ.50వేలు, ఎమ్ సాయిశ్రీ రూ.25వేలు, ఎస్ విజయలక్ష్మీ, ఎస్ వెంకటేశ్వరరావు,పి అజరు కుమార్, సంధ్యారాణి ఒకొక్కరు రూ.10వేలు చొప్పున నగదు రూపంలో అందించారు. తెనాలికి చెందిన బమ్మినేని హాస్పిటల్ అధినేత బమ్మినేని దుర్గారాణి రూ.15లక్షలు,కాటూరి మెడికల్ కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విజయవాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ శోభ ఆర్ పొదిల రూ.10లక్షలు మంత్రి లోకేష్‌కు అందచేశారు. పాతూరి శ్రీనివాస్ రూ.5లక్షలు యలమంచిలి అరుణ రూ.2,02,000లు, ఎం మాధురీలత రూ.1.5లక్షలు, పాతూరి మధుసూదన్‌రావు రూ.లక్ష, కోట వెంకటభాస్కరరావు రూ.50వేలు, సాయి ఫేస్ స్కాన్ సెంటర్ యజమాని అన్నపూర్ణ రూ.25వేలు, ప్రభుకుమారి రూ.20వేలు అందచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఛాంబర్ రూ.7.70కోట్ల విరాళం ప్రకటించింది. త్వరలోనే సిఎంను కలిసి అంగీకార పత్రాన్ని త్వరలో అందిస్తామని వెల్లడించింది.
ఒక రోజు వేతనం ప్రకటించిన విద్యుత్ ఉద్యోగులు
విద్యుత్ సంస్థల ఉద్యోగులు నెల వేతనంలో ఒక రోజు బేసిక్ పేను విరాళంగా ఇచ్చారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అంగీకారం పత్రం అందించారు. ఒక రోజు బేసిక్ పే విరాళంగా ప్రకటికస్తున్నట్లు ఎపి రాష్ట్ర విద్యుత్ బోర్డు ఇంజనీర్స్ అసోసియేషన్, అసిస్టెంట్ ఎగ్జీక్యూటీవ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌కు శుక్రవారం ఇరు సంఘాల ప్రధాన కార్యదర్శులు కె నాగప్రసాద్, ఎస్ ప్రతాప్ లేఖ రాశారు.
