ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్‌ మెట్రో

May 14,2024 11:06 #crowded, #Hyderabad Metro

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ వైపు రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. కానీ, మంగళవారం 5.30 నుంచే రాకపోకలు మొదలయ్యాయి. రద్దీ దృష్ట్యా మరిన్ని ట్రిప్పులు నడిపే అవకాశముంది.

➡️